31, జులై 2017, సోమవారం

శబరిమల అందాలను 360 డిగ్రీ లో వీక్షణం




Sabarimala a 360 degree panoramic view. You can touch and move. All important places are listed. Amazing technology. Nicely created....Swamiye Saranam Ayyapa.

https://www.p4panorama.com/panos/sabarimala/

For those who have not been to sabarmala , this would b a great opportunity to view the place...👍👍👍thanks to technology

30, జులై 2017, ఆదివారం

ఐశ్వర్యానికి కారకుడు శివుడు


*ఐశ్వర్యానికి కారకుడు శివుడు*

ఈశ్వరానుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్తాడు.

శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు, నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసంకు చేరుకుంటాడు.

శివుడు సర్వాంతర్యామి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమంకుంటున్నారో అన్ని తెలుసుకోగలడు. కుబేరుడు అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి పథకాన్ని అర్దం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు.

కుబేరుడు వచ్చి.. మహాదేవా.. మీరు, పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు.

శివుడు తనకు కుదరదన్నాడు, భర్త రాకుండా తానుకూడా రానన్నది పార్వతీ దేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు.

వస్తూనే... 'అమ్మా! ఆకాలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు' అన్నాడు గణపతి.

పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి..
'కుబేరా! మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు' అనగా, శివుడు 'ఔనౌను, గణపతికి విందు భోజనం అంటే మహాఇష్టం. మా బదులుగా గణపతిని తీసుకెళ్ళూ' అన్నాడు పరమశివుడు.

హా! ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడా, నా ఇంటికి విందుకోచ్చేది.

ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకుని బయలుదేరాడు. తన భవనంలోకి తీసుకెళ్ళి, తన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపించసాగాడు.

ఇవన్నీ వ్యర్ధం, త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా, కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు.

వెంటనే బంగారు కంచం పెట్టి, రకరకాల తీపి పదార్ధలు, పానీయాలు, కూరలు, పండ్లు.. గణపతికి వడ్డించారు.

కుబేరుడు చూస్తుండగానే ఒక్కపెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి, ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు.

సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు.

ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు. వంటవారికి ఆహారం వండటం గణపతికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం చూస్తూండగానే ఖాళీ అయిపోయింది.

విషయం కుబేరుని తెలిసింది. తన సంపద మొత్తం తరిగిపోతోంది కానీ, గణపతి కడుపు నిండడంలేదు, ఏమి చేయాలో అర్ధంకాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని, నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావ్ అంటూ పలికాడు.

కుబేరుడికి విషయం అర్ధమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏ మాత్రం సంతృప్తి పరచలేదని, అన్ని ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగున కైలాసానికి వెళ్ళాడు.

శివా.. శంకరా.. నీవే దిక్కు.. ధనం కి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహంకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్నీ ఖాళీ చేసి, అన్ని ఇచ్చిన భగవంతుడే, అహంకరించినవారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డడైన గణపతి ఆకాలి తీర్చలేకపోతున్నాను. ఏదైనా మార్గం చూపించండి అన్నాడు.

అప్పుడు శివుడు "కుబేరా! నీవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావల్సినది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం, నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మత్రామే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పేడు బియ్యం తీసుకుని అహకారం విడిచి, చేసిన తప్పుని ఒప్పుకుని పరమభక్తితో గణపతికి సమర్పించు" అన్నాడు.

కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణపతికి భక్తితో సమర్పించాడు.

ఆ గుప్పేడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి, త్రేనుపులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు.

మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం.

కుబేరుడి అహంకారాన్ని అణిచివేసిన గణపతి, మనలోని అహంకారాన్ని కుడా పటాపంచలు చేయుగాకా.

*నీతి:* పెట్టేది కొంచెమైనా అహంతో కాకుండా ప్రేమతో భక్తితో పెట్టడం వల్ల అంతా మంచి జరుగుతుంది.
[22/06 14:22] ‪+91 98859 36666‬: 🌚24-06-2017 నా
శని అమావాస్య🌚

శనివారం నాడు వచ్చే
అమావాస్యని 🌚శని అమావాస్య 🌚చాలా విశేషమైనది.
(జ్యేష్ఠమాసం మరియు శనివారం మరియు జ్యేష్ఠ  అమావాస్య , ఆరుద్ర నక్షత్రం ,అన్నీ కలసిన ఈ రోజున శని భగవానునికి చేసే పూజా పునస్కారాలు దానధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభఫలితాలనిస్తాయి, అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలనిస్తాయి. శని త్రయోదశి ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయడం చాల విశేషంగా లాభిస్తుంది. ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలనిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
జాతక రీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు. ఏలిననాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని వలన ఎవరైతే పీడింప బడుతున్నారో అటువంటివారు ఈ రోజు శని పరిహారాలు అంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం, ఉపవాసం ఉండడం, రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టడం, నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయడం. నల్ల కాకికి అన్నం పెట్టడం, నల్ల కుక్కకి అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుము దానం చేయడం మంచిది. ఈ విధంగా శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషం, దారిద్య్రం తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహంలో ఆటంకాలు, శత్రు భయం, కోర్టు సమస్యలలో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయి.
విశ్వాన్ని గ్రహాలు ప్రభావితం చేస్తున్నా... శనీశ్వరుడి ప్రభావం చాలా తీవ్రమైనదని చెప్పవచ్చు. మానవులకు ఎదురయ్యే కష్టసుఖాలకు, వారి వారి కర్మల అనుసారంగా ఫలితంగా ప్రసాదించేది శనిదేవతనే! సాధారణంగా శనిదేవతపై అనేకమందిలో చాలా రకాలైన అపోహలున్నాయి. శనీశ్వరుడి పేరు చెప్పగానే ఉలిక్కిపడతాం. నామాన్ని ఉచ్ఛరించడానికి సైతం వెనకాడతాం. ఆయనకు ఆగ్రహం కలిగే పనుల్ని చేయరాదని తీర్మానించుకుంటాం. శనీశ్వరుడిని ఆహ్వానించినట్టవుతుందని తైల పదార్థాలు వేటినీ చేతులతో అందుకోం. ఆయన దృష్టి మనపైకి సోకరాదని పదే పదే కోరుకుంటాం. కొన్ని ప్రాంతాలవారైతే శనివారంనాడు తిలా సంబంధిత వస్తువులేవీ కొనరు, తినరు. అంత భయం ఆయనంటే. శనీశ్వరుడు కేవలం క్రూరత్వానికి, పీడించడానికి మాత్రమే ఉద్దేశించబడలేదు.

గ్రహరూపంలో ఉండే భగవంతుడు:
సృష్టి, స్థితి, లయ కారకులు త్రిమూర్తులు. మనం చేసిన కర్మల ఫలితాలనివ్వడానికి భగవంతుడే గ్రహాల రూపంలో అవతరించాడు. ఒక్కో గ్రహానికి ఒక్కో దేవత మూల పురుషుడు. సూర్యుడు, చంద్రుడు, మార్స్‌, మెర్క్యురీ, బృహస్పతి, వీనస్‌, శని గ్రహాలకు వరుసగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, బుద్ధుడు, వామనుడు, పరశురాముడు, కూర్మావతార విష్ణువు, వరాహస్వామి, మత్స్యావతార స్వామి ఆవహించి ఉన్నారు. అందువల్ల గ్రహాలు దైవాంశసంభూతులని అర్థంచేసుకోవాలి. గ్రహకూటములు రాజ్యాలను కూల్చడానికే కాక మొత్తం ప్రపంచం ఉనికికే మూలం.

పూర్వజన్మ కర్మ ఫలం:
ఓ వ్యక్తి పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితాలనే ఈ జన్మలో అనుభవిస్తాడు. అందుకే ప్రతి వ్యక్తీ తన మహర్దశ, అంతర్దశలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలనుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరం. శని మంచి దృష్ట్టితో ఉంటే జీవితం నందనవనమవుతుంది. అదే శనిదేవుడు వక్రదృష్టి పడిందంటే అంతే సంగతులు. ఆయన అనుగ్రహముంటే రాజ్యాలేలే చక్రవర్తులవుతారు. ఆయన గనుక పట్టుకు న్నాడంటే అమీరులయినా బికారులవడం ఖాయం. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవలసిన అంశం. చెడు కార్యాల్లో నిమగ్నమైనవారినే శనీశ్వరుడు పీడిస్తాడు.

ఫలితం అనుభవించాల్సిందే:
ఎంత దైవాంశసం భూతులైనా వారి వారి కర్మలననుసరించి ఫలితాలను అనుభవించి తీరాలి. చెడుకార్యాలకు పాల్పడినవారిని శనిదేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. పురాణాల ప్రకారం సూర్యభగవానుడు కర్మలకు సాక్షి అయితే, శనిదేవుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు. ఆయా ఫలితాలను మాతృగర్భంనుంచి వెలువడిన మరుక్షణం నుంచీ అనుభవించడం మొదలవుతుంది. మంచి కార్యాలు చేసినవారికి శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడు. ఇది అర్థం చేసుకోనివారు శని భగవానుని క్రూరాత్మునిగా భావిస్తారు. ఇది కేవలం మూర్ఖత్వం. శని దేవుడికి భయపడడం అవివేకం. ఆయన మానవ కర్మలకు ఫలితాలనిచ్చే దైవం. అలుపు సొలుపూ లేకుండా బిజీగా ఉండే లైఫ్‌లో కొంచెం సమయాన్ని సత్కార్యాలకు కేటాయించాలి. నిజాయితీగా జీవించాలి.

భయపెట్టే దేవుడు కాదు:
భగవంతుడు శనిదేవుణ్ణి జీవరాసుల కర్మల ఫలితాలను ఇచ్చే వర్రపదాయినిగా బాధ్యతలు అప్పగించాడు. ఆయన తన బాధ్యతలను నిజాయితీగా, ఖచ్చితత్వంతో సమవర్తిగా నిర్వహిస్తాడు. ఇందులో ఎటువంటి పక్షపాతబుద్ధి లేదు. దీనికోసం ఆయనను పూజించాలే కానీ, భయపడకూడదు. ప్రకృతి నియమాలను అనుసరించి ఏ జీవి అయినా తన వంశపారంపర్య లక్షణాలను వదులుకోడు. శని భగవానుడు మహర్షి కశ్యపునకు మనవడు. కశ్యపాత్మజుడైన సూర్యభగవానుడికి కుమారుడు. ఈ చుట్టరికమే ఆయనను మిగతా దేవతలకన్నా ప్రత్యేకమైనవాడిగా చేసింది. శనిదేవుడు మంచి మార్గంలో నచిచే మానవులకు సేవకుడిలా, ముక్తిధామానికి కొనిపోయే మార్గదర్శిలా కూడా పనిచేస్తాడు. శనిదేవుని బంధుగణమంతా గొప్ప అధిదేవతలు. సూర్యునికి కుమారుడు, విష్ణువు అంశ అయిన శనీశ్వరుడికి సంధ్య, ఛాయలు మాతృమూర్తులు. మను సౌవర్ణి, యమధర్మరాజులు సోదరులు. యమున, భద్ర నదులు సోదరీమణులు. వీరందరిలోని దైవాంశలు కలిగిన శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఎన్నో మార్గాలున్నాయి.

ఓర్పు, సహనం ముఖ్యం:
మంచికన్నా చెడు రాజ్యమేలే కలియుగంలో శని అనుగ్రహం సంపాదిం చాలంటే, ఓర్పు సహనం ఉండాలి. అవినీతి, అపసవ్య మార్గాలలో పనులు సాధించుకోవాల నుకునేవారు, ధనార్జన చేసేవారు తొలుత విజయం పొందగలిగినా చివరకు దక్కించుకునేది అశాంతినే! తాత్కాలిక విజయాలు సాధించినవారు శనిమహరాజు కోర్టులో తప్పక శిక్షించబడతారు. ఆయన కోర్టులో లంచాలకు, రికమెండేషన్లకు తావులేదు. మానవులు తాము చేసిన ప్రతి దుష్కర్మకు జవాబు చెప్పి తీరాల్సిందే! అక్కడ ఏ దేవుడూ శనీశ్వరుడి బారినుంచి తప్పించలేరు. ఆయన ఒక్కసారి తీర్పు ప్రకటిస్తే దానికి తిరుగులేదు. త్రిమూర్తులలో ఎవరూ దానిని సరిచేయలేరు. కనీసం అడ్డుకోలేరు. ఆయన ముందు మంచిపనులు, ప్రార్థనలు, భక్తియుతులనే పిటిషన్లు తప్ప ఏవీ పనిచేయవు. శనిభగవానుడి తీర్పు సుప్రీంకోర్టు తీర్పేనని గుర్తుంచుకోవాలి. శనిదేవుడు చెడ్డవారిని, తప్పులు చేసినవారిని పట్టి పీడించడంద్వారా వారిలో పశ్చాత్తాపాన్ని కలుగజేస్తాడు. మోక్షం దిశగా వారి ఆలోచనలను పురిగొల్పుతాడు. గర్వంతో విర్రవీగేవారిని నేలకు దించుతాడు. స్వర్ణకారుడు పుటం వేసి బంగారాన్ని కాల్చి నగలను తయారు చేసినట్లుగా...శనీశ్వరుడు మానవుల్లోని మాలిన్యాన్ని కడిగేస్తాడు.

శని దండనాధికారి:
జ్యోతిష్య శాస్తర్రీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాతగా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది. బౌతిక దృష్టిలో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.. ఈశ్వర శాసనంలో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలా శని దండన విధిస్తాడు.

శనికి ప్రీతిపాత్రమైన రోజు:
శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి, త్రయోదశికి అధిపతి కామదేవుడు. అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శనిత్రయోదశి శనికి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది. క్షీరసాగర మదనం జరిగి అమృ తం ఉద్భవించిన తరువాత, హాలాహలాన్ని దిగ మింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతఙ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్లారు. అది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ సమయంలో శివుడు, మన గణాల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేసాడట. ఆ శివ తాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది. ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషమంటే మునిమాపు వేళ దోషం అంటే రాత్రి అని అర్ధం చంద్రున్ని దోషాకరుడు అని అంటారు, రాత్రికి కారణమయ్యేవాడనే అర్ధం ప్రదోషమంటే దోష ప్రారంభకాలం అంటే రాత్రి ప్రారంభ సమయo.

కాలం మారుతోంది

29, జులై 2017, శనివారం

వెలుగును విస్తరింపజేయండి. చీకటి జాడల్ని ఎంచనవసరం లేదు.



ఒక జాలరి చెరువులో గాలంవేసి చేపల్ని పడుతున్నాడు. అది చూసిన ఒకాయన “ఏం చేస్తున్నావు?” అని అడిగితే, ‘నీటిలో మునిగిపోయిన చేపల్ని ఒడ్డున పడేస్తున్నాను – కరుణతో – అని సమాధానమిచ్చాడు జాలరి. మతమార్పిడి చేస్తున్న పెద్దమనుషులు ఈ జాలరులవంటి వారే” – ఈ మాటలు స్వామీ దయానందసరస్వతీ మహోదయులు వక్కాణించినవి. ఎంత అద్భుతంగా వాస్తవాన్ని వర్ణించారు!
ప్రేమ, సేవ తమ స్వభావాలన్నట్లుగా మాట్లాడుతూ, వంచనతో హిందూ చేపల్ని సనాతన దర్పము చెరువునుండి బయట పడేస్తున్న విదేశీ మతోద్యోగుల వ్యాపారుల వంచనాశిల్పమిది.
వారు దయను అభినయిస్తూ మాట్లాడవచ్చుగాక. కానీ చేపలు మాత్రం – “ఆహా! వీడెంత దయామయుడు! నీటిలో మునిగిపోయిన నా బ్రతుకును ఒడ్డున పెడుతున్నాడు. బయటనున్న విశాల ప్రపంచాన్ని చూపించాడు. చెరువే ప్రపంచమనుకుని ఇన్నాళ్ళూ భ్రమతో ఉన్నాను” అని మురిసిపోతే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. మతం మారిపోతున్న వారంతా అటువంటి మూర్ఖమీనాలేననడం సందేహం లేదు.
గమనిక: ఈ సందర్భంలో వ్రాస్తున్న మాటలన్నీ ఇతరమతాలని ఎత్తిచూపడమో, కించపరచడమో కాదు. అందరినీ గౌరవిస్తూ ఎవరి ధర్మంలో వారు బ్రతకాలి అని చెప్పడమే ఉద్దేశం. అన్ని మతాలపైన సహన, సోదరభావం సహజంగా కలిగిన హిందువుగా ముందే ఒక విన్నపం చేసుకొని విషయాలను స్పష్టం చేసుకుందాం.
ప్రేమలు, సేవలు, రక్షణలు, స్వస్థతలు, సువార్తలు, కూటములు ఇవన్నీ విష కుంభాలపై జల్లిన అమృతపు చినుకుల పొంగులేననీ కాస్త వివేకమున్న వాడెవడైనా ఒపుకుని తీరవలసిందే!
పరాయిదేశాల నుంచీ వచ్చే మతవ్యాపారుల మోచేతి నీటి తీర్థప్రాశన చేస్తున్న పాపాత్ములు, తమ ధనాశను తీర్చుకోవడానికై చేస్తున్న వ్యాపారమిది. ‘ధర్మం’ పేరుతో వ్యాపారాలు చేయడం వారి నైజం!
‘అది మతమూ కాదు, ధర్మమూ కాదు. అది కేవలం వాణిజ్యం(commerce) అని ఏనాడో అనీబిసెంట్ అన్న మాటని విస్మరించరాదు. హింస, విధ్వంసాలు పునాదులుగా విస్మరిస్తూ వ్యాపారంగా, పాలనగా తామే ప్రపంచాన్ని ఏలాలనే విషకాంక్షతో, వ్యూహాత్మకంగా పరిశ్రమలను నడిపేటంత యాజమాన్య శిక్షణలతో మన అవినీతి నాయకుల అండదండలతో పెచ్చరిల్లుతున్న పైశాచిక కాండయే ఈ మతమార్పిడుల మారణోద్యమం! ఇది దాచేస్తే దాగని సత్యం!
ఇలాంటి నేపథ్యంలో ఆ విదేశీమత వాణిజ్యసంస్థలు విసిరే నోట్ల కట్టలకోసం – మానవతా ధర్మానికి విరుద్ధంగా ఒక కులాన్నో ఒక మతాన్నో తరచూ అవమానిస్తూ, లోపభూయిష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్న మీడియా దారుణ కృత్యాలు ఊపందుకుంటున్నాయి.
పనికట్టుకొని హిందూ శ్రద్ధాకేంద్రాలలో లోపాలను ఎత్తిచూపడమో. హిందూ వ్యవస్థలోని ఏ జాతి వివక్షనో లేవదీసి చర్చావేదికలు పెట్టడమో చేసి వినోదిస్తున్నారు. దీనిద్వారా హిందూమతాన్ని సంస్కరించుదామనే మహోద్దేశాలేమీ లేవు. కేవలం తమకు హిందూ ద్వంసకాండ ద్వారా, పరాయి వారి నుండి లభించే దానాల కోసం చేసే ప్రాజెక్ట్ లు మాత్రమే ఇవి.
“హిందూమతం కొన్నాళ్ళకి తగ్గిపోతుంది’ అని కొందరిచే అనిపించి, దానిని ఖండించే అమాయకుల్ని కూర్చోబెట్టి అరిపించి ఒకసారి వినోదిస్తే...’హైందవుల అంతర్మథనం’ అంటూ చర్చ లేవదీసి, హిందువులలో లోపాలవల్లనే మతమార్పిడులు జరుగుతున్నాయంటూ ఆరోపణలు చేస్తూ వాటికి సమాధానాలిమ్మని పదిమందిని అడిగి, వారిని సంపూర్ణంగా మాట్లాడనివ్వకుండా అడ్డుకుంటూ వికృతకేళిని మరోసారి నిర్వహిస్తారు.
ఇవి కొన్ని ‘ఛా’నల్స్ కు ఆనవాయితీ. ఈ కైంకర్యం వలన వారికి మతాంతరీకరణ సంస్థలనుంచి పెద్ద మొత్టాలే ముడతాయి. కానీ వారు చూపిస్తున్న లోపాలు, ఆరోపణలు నిజానికి చెప్పుకోదగ్గవి కావు. లోపమూ, ఆరోపణా లేని మతమూ, సిద్ధాంతమూ, వ్యవస్థా ఏదీ ఈ భూమి మీద లేదు.
హిందువుల్లో కొన్ని ముఖ్య లోపాలున్నాయి. అవి మూడే మూడు. ఇంతకుమించి మరేమీ లేవు అని సవినయంగా మనవి చేసుకుందాం.
ఒకటి: అన్ని మతాలూ ఒకే సత్యం వైపు నడిపించే దారులు...అని తాత్త్వికంగా  మాట్లాడి, అందర్నీ అక్కున చేర్చుకోవడం. ఇదే తాత్త్విక దృష్టి అవతలి వాడికి లేదని తెలుసుకోలేకపోవడం.
రెండవది: దీనిని అలుసుగా తీసుకుని ప్రవేశించి మనల్ని నిందిస్తూ అవతలివారు రెచ్చిపోతుంటే, చూస్తూ సహిస్తూ, ‘నిజమే-మాలో లోపాలున్నాయేమో!’ అని భ్రమించి విస్తుపోవడం.
మూడవది: ఏ మతాన్ని ఎత్తిచూపినా అది మానవతావాదానికి విరుద్ధమనీ, ‘ఒకరి మనోభావాలను దెబ్బతీయకూడదనే ఇంగిత జ్ఞానం కూడా మాధ్యమరంగానికి లేదా?’ అని ప్రశ్నించలేకపోతున్నాం.
“నీ చానల్ వీక్షకుల్లో హిందువులు లేరా? వారి మనసు గాయపడదా?’ అని అడగలేని చవటాయితనం పెద్దలోపం. – ఈ మూడు లోపాలు తప్ప మరేమీ లేవు. మిగిలినవి వాళ్ళు చిత్రించి చూపిస్తున్నవే గానీ లోపాలు కావు.
‘ఒక సిద్ధాంతంలోని లోటుపాట్లు చర్చించాలంటే దానిలో ప్రావీణ్యం ఉండాలి. అధ్యయనం ఉండాలి. కనిపిస్తున్న వ్యవహారాలు చాలవు. యుగాలనుండి వర్ధిల్లిన విస్తారమైన హిందూధర్మం వీరికి అర్థమౌతుందా?
చెట్టులో, పుట్టలో, రాతిలో, పసుపుముద్దలో, విగ్రహంలో, యంత్రంలో, మంత్రంలో, యజ్ఞాగ్నిలో, దీపకళికలో, సూర్యచంద్రులలో, నదీజలాలలో, పర్వతాలలో పరమాత్మను భావించి ఆరాధించే ఉదాత్త దర్శనశక్తి వీళ్ళకి అవగాహన అవుతుందా?
ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం ప్రార్థించడం దగ్గరనుంచి, అన్ని సుఖాలను త్యాగం చేసి, పరమ వైరాగ్యంతో ఆత్మతత్త్వాన్ని  ఆవిష్కరించుకొని, తరించే తత్త్వజ్ఞాన సంపత్తి కలిగిన ఒకే ఒక ధర్మం – హైందవమేనని వారికి తెలుసా? వ్యాస వాల్మీకి అగస్త్య వసిష్ఠాది మహర్షుల తపఃఫలం, ఆదిశంకర, రామానుజాచార్య, మధ్వాచార్య వంటి మహాతత్త్వవేత్తల దర్శనశక్తి, రామకృష్ణపరమహంస, స్వామీ వివేకానంద, స్వామీ రామతీర్థ, పరమహంస యోగానంద వంటి మహనీయుల జ్ఞానవైభవం, రమణమహర్షి, కావ్యకంఠ గణపతి ముని, స్వామి రామా వంటి మహాయోగుల తత్త్వదీప్తి, వీటి ప్రభావంగా ఎందఱో విదేశీ మేధావులు హిందూ ధర్మ సాధనలను ఆచరించి, జ్ఞానసిద్ధిని పొందిన ఘట్టాలు...వీటి గురించి ఎప్పుడైనా పరిశీలించారా!
రంగులు లేని కళ్ళద్దాలతో, వీరి విజ్ఞానాల్లో కొన్ని పుటలైనా అధ్యయనం చేశారా? కొద్ది వేల ఏళ్ళ చరిత్ర, ఒక్క పుస్తకం, ఒక్క ప్రవక్త బోధ మాత్రమే కలిగిన పరిమిత జ్ఞానాన్ని పట్టుకొని, హింస, విధ్వంసాలతో ఎన్నో దేశాల నాగరికతలను నాశనం చేసి, ఆక్రమించుకున్న అల్పకాల మతాలను వెనకేసుకు వచ్చి అనాది యుగాల నాటి దేశీయ దివ్య విజ్ఞానాన్ని విచక్షణారహితంగా ఎద్దేవా చేయడానికి, ఒక్క మీడియా ఉందన్న అహంకారం అర్హతగా సరిపోతుందా?
ఇతరమతగ్రంథాలు, ప్రవక్తలు తక్కువ వారు అనే పాపానికి మేము ఒడిగట్టడం కాదు కానీ ఒక్క సత్యం మాత్రం విస్మరించవద్దు అని వినతి చేసుకుంటున్నాం. ఏ ప్రవక్తలకో తీసిపోని, ఇంకా మాట్లాడితే మించిపోయిన యోగులు, మహర్షులు, మహాత్ములు, సిద్ధపురుషులు, మునులు, తపస్వులు, జ్ఞానులు వేల సంఖ్యలో కలిగిన ఒక మహాసుధాసముద్రం సనాతన ధర్మం. దీనిలో ఒక కెరటం పాటి ఉండవు ఇతర ధర్మాలు. ఆ మిడిసిపాటుతనంతో ఆక్రమణలు చేసుకున్న మతాలకు అంతర్మథనాలు, ఆత్మ పరిశీలనలు అవసరం!
అలాంటి అంతర్మథన కార్యక్రమాలను మీడియాలకి పెట్టగలిగే దమ్ముందా?
చరిత్రలో ఇప్పటికి ఎన్ని దేశాల్లో మతవిస్తరణ కోసం మాన, ప్రాణభంగాలు చేశారు? ఎన్ని అద్భుతమైన నిర్మాణాలు ధ్వంసం చేశారు? చేస్తున్నారు? మీ మతదేశాల్లో ఇతరులకి స్వేచ్ఛా వాయువులున్నాయా?
మీరు ధ్వంసం చేసిన ఆలయాలను మళ్ళీ పునర్నిర్మించగలరా? ఉగ్రవాదమో, తీవ్రవాదమో, వేర్పాటువాదమో, కరడుగట్టిన మతఛాందసమో తప్ప ఒక్క యోగ విజ్ఞానాన్నీ గానీ, తత్త్వజ్ఞానాన్ని గానీ, త్యాగశీలురను గానీ, ఉదారవాదులను గానీ మీ సిద్ధాంతం ఎందుకు తయారుచేయలేదు? ఉగ్రవాద శిక్షణలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? డబ్బులకోసం మతం మారడం తగునా? మీ మతంలో ఏమి అధ్యయ్యనం చేసి మారుతున్నారు? అని ప్రశ్నించగలరా?
అన్యమతస్థులకు సమానావకాశాలు కల్పించి, ఉన్నత పదవులను పాలనాధికారాలను, గౌరవాలను, ప్రశంసలను అందించగల ఒకే ఒక్క ధన్య దేశం భారతమేనని సగర్వంగా చాటవలసిన ఉన్నత స్థితిలో ఉన్న మనకు ఆత్మన్యూనతను కల్పించడం తగునా?
ఒక దుర్మార్గుడు ఒక అమాయకుడిని చితకబాడి దోచుకున్నాడు. ఇతగాడు రోదిస్తూ ఉంటే వచ్చి “నీలో బలహీనత వల్లే వాడు కొట్టాడు. ణీ లోపాలు తెలుసుకో దిద్దుకో” అని ఉపన్యాసమిచ్చినట్లు, మన లోపాలు ఏమిటో వెతుకుతున్నారు. ద్రోహబుద్ధితో వంచనతో తిరుగుతున్న దుర్మార్గాన్ని సమర్థిస్తున్నారు. మీ అంతరాత్మను సూటిగా ప్రశ్నించండి.
మీరిప్పుడు హిందూమతంపై ప్రశ్నలు కొత్తవేమీ కావు. వీటన్నిటికీ మాడు పగిలేలా సూటి సమాధానాలు వందల ఏళ్ళనుండి వివేకానంద వంటి మహాత్ములు ఇస్తూనే ఉన్నారు.
ధర్మంలో పూర్ణత ఉన్నా, వ్యక్తుల స్వార్థాల వల్ల, ఇతరుల దాడుల వల్ల, అన్యం పట్ల వ్యామోహం వల్ల రాజకీయ దుర్మార్గం వల్ల ఏర్పడ్డ ఛిద్రాలను అవకాశాలుగా తీసుకుని ధర్మనింద చేయడం తగునా?
అగ్రవర్ణాలకు చెందని ఎందఱో యోగులు, జ్ఞానులు, అవధూతలు ఈ దేశంలో ఏనాటినుండో గౌరవింపబడుతున్నారు. హిందువు ఎప్పుడూ గర్వించదగ్గ స్థాయిలోనే ఉన్నాడు. విదేశీమతపెద్దల పెట్టుబడులతో, వారిచేత పెట్టబడిన బుర్రలున్న పాలకులతో అలరారుతున్న మాధ్యమరంగం దృష్టిలో హిందూత్వం వెలవెలపోతోంది. కానీ వాస్తవ దృష్టితో చూస్తే హిందూ వైభవం జగద్వ్యాప్తమౌతోంది.
ఎందఱో బడుగువర్గాల వారు దీక్షగా అయ్యప్పను సేవిస్తున్నారు. భవానీ మాలలను ధరిస్తున్నారు. ఆపదమొక్కుల వానికి అడుగడుగు దండాలు పెడుతున్నారు. వారిని ఆ ఆలయాలు ఆహ్వానిస్తున్నాయి. ఉత్తరాది క్షేత్రాల్లో కూడా జ్యోతిర్లింగాలు అతిసామాన్యుని చేత అభిషేకించుకుంటున్నాయి. తొక్కిసలాటలతో, బారులతో తిరునాళ్ళు, కుంభమేళాలు, పుష్కరాలు జరుగుతున్నాయి. మేధావులారా! ఒక్క విచక్షణని సాధించే ప్రయత్నం చేయండి.
సృష్టిలో అన్ని ధర్మాలకు వేటి స్వభావం వాటికుంటుంది. వైద్యవిధానాల్లో వంద రకాలున్నాయి. మతాలూ అలాగే ఉంటాయి, ఉండాలి. ఆయుర్వేదంలో అనుపానానికీ, పథ్యానికీ ప్రాధాన్యం. ఆధునిక వైద్యంలో వాటి అవసరం లేదు. అంతేగానీ పథ్యానుపానాలు లేని ఆధునికమే మంచిదని గానీ, అవి కలిగిన ఆయుర్వేదమే శ్రేష్ఠమని గానీ సిద్ధాంతం చేయడానికి వీలులేదు. సాఫల్య వైఫల్యాలు రెండింటిలోనూ ఉంటాయి. అవి వైద్య శాస్త్రం లోపాలు అనలేము. వైద్యుల పొరపాటో, రోగుల గ్రహపాటో అని సర్డుకుపోతున్నాం. అవే మతాలకు వర్తిస్తాయి. దేని ప్రత్యేకత దానిదే. ఏ విద్యావిధానాన్ని అనుసరించే రోగి దాని పధ్ధతిలోనే చికిత్స పొందాలి. అంతే.
వీలయితే అధ్యయనం చేయండి. మంచిని బోధించండి. అందరినీ కలసిమెలసి ఆనందంగా బ్రతకనివ్వండి. కించపరచడాలు, ఎత్తిచూపడాలతో మీరు సాధించేదేమిటి?  హిందూ మత నిర్మూలనమా? అది మీవల్ల కాదు.
ఎప్పటికప్పుడు కాలానుగుణంగా సవరించుకుంటూ, సంస్కరించుకుంటూ ఎదుగుతున్న ‘డైనమిజం’ హైందవంలో ఉంది.
చివరిగా ఒక మాట- వాస్తవాలను చర్చించడమే ఇందులో ఉద్దేశం. ఒక ఆర్తినీ, సత్యఘోషనీ వెలువరించడమే ఆంతర్యం. అంతేగానీ ఏ ధర్మాన్నీ కించపరచే భావం ఈషణ్మాత్రం కూడా లేదని సవినయంగా మనవి. యుగాల క్రితమే, సృష్టిస్థితిలయకారకమైన మహా చైతన్యం గురించి అన్నిరకాల భావనలను ఆవిష్కరించి, ఎవరి సంస్కారానికి తగినట్లుగా వారు తరించడానికి రాచమార్గాలు వేసిన విశాల సనాతన ధర్మానికి చెందినా ఏ ఒక్కరూ అన్ని మతమార్గాలను గౌరవించే విజ్ఞతతోనే ఉంటారు. సమాజంలోని లోపాలను, వ్యక్తుల అవినీతినీ ధర్మానికి అంటగట్టవద్దు.
క్షుద్రప్రయోజనాల కోసం కాకుండా సామరస్య జీవన సరళితో కూడిన సమాజ నిర్మాణానికి శక్తిమంతమైన మాధ్యమరంగం కృషి చేయాలి. అన్నిటిలోని మంచిని మాత్రమే వ్యాప్తి చేస్తే, చెడు దానంతటదే తొలగిపోతుంది. వెలుగును విస్తరింపజేయండి. చీకటి జాడల్ని ఎంచనవసరం లేదు.
ముస్లిం, క్రైస్తవ సోదరులు కూడా ఈ దిశగా సామరస్య భావనను అవలంబించలి --   సామవేదం షణ్ముఖ శర్మ  గారి ప్రవచనం నుండి