31, అక్టోబర్ 2013, గురువారం

Common Medical Problems

Common Medical Problems

There are certain medical illnesses that can affect any individual anytime and needs only some medicines to control them. They are usually infrequent but if severe or frequent, medical help should be sought.
Fever
Fever is the symptom of Infection in the body,and may be- viral , bacterial , or fungal. In India Malaria, and Viral infection are very common. If the cause is found -treat the cause .
 For symptomatic releif thefollwing  measures are taken-
1) rest & very light diet ,
2) cold sponging ,
3)medicines:- a. Paracetamol..for adult; 500mg 3 times/day,
                   b.antibiotic-to prevent and controle infection.. ciprofloxin 500 mg (ciprobid) two times/day.
                  c. B-complex (Beplex fort) for strength. Ues 3-4 days ,if no relief consult your family doctor
Headache
This may be due to sun heat, tension, constipation, defective vision, cold, fever, hunger, hypo tension etc. It may be ache or throbbing in nature. It may be continuous or intermittent.
The cause, if found, should be treated.
Patient should be given :
paramet(calpol. 1 tab 3times/day,OR, Combiflame or dolomed, 1 tab two times/day
aspirin(Ecosprin-150mg two times/day, or analgin(Capralgin 1 tab 3times/day).
Cold compress placed on the head also may be useful in some patients and can be tried before taking the medication.
Earache
It could be due to wax or boil in the external ear. Referred pain from the tooth can also give rise to toothache. Air travel and cold can also lead to ear pain. The cause should be found and treated. Consult a doctor. Analgesic should be taken. Wax can be dissolved with soda glycerin eardrops and removed. Cold should be treated.
Treatment: 1 clean the ear with warm water by syringingthe ear, using aurl syring
                2.pour 3-4 drops of 4% xylocain in the ear for temparary relief
                3.tab. Nise 100mg 1 tab 3times /day for 3-4 days
                4.tab. Etomin 250 mg 1tab three times/day for 3-4 days
                5.Ear drops Candibiotic - 2-3 drops 3 times /day for 3-4 days


Toothache
It is due to tooth decay.
Take pain relief tablets.-Tyfizox(diclofenac+paracetamol)- 1tab three times /day  for 3-4 days
Use local clove oil application.
Take antibiotic- Oflaxacin 200 mg(Oflamac) two times/day for 3-4 days
Get the carried tooth extracted or cemented.
Cold and cough
It is usually due to the viral infections or pharyngitis. Antihistamines are useful. Take hot beverages and avoid cold foods. Nasal drops of saline can also be relieving. Steam inhalations may help. Asthmatic patients should take their inhalers of bronchodilators and steroids.
1.for releif "Rhino" or "Nozee" 1 tab 3 times / day for 3-4 days
2.to prevent infection take antibiotic- Roxierythromycin (Sirox 150 mg two times /day foe 4-5 days
Abdominal pain
It could be due to worms, loose motions and dysentery. Gas and constipation can also lead to pain. Find the cause and treat it. Reassure the patient. Make him/her comfortable. Hot water bags may give some relief and remove the gas.
Anti-spasmodic drugs : Dysmen or Cyclopam ,  1 tab three times / day for 2-3 days can be taken.
Antacids- Digene or Gelusil 1 tab 3-4 times /day for 2-3 days
Loose motions
Loose motions It is due to infection of the intestine. Give the victim plenty of oral fluids. Buttermilk, rice gruel, porridge, curds, are nutritious and also decrease the loose motions and aid in water absorption. Spicy foods should be avoided. Maintain hygiene. Wash hands well.
1.Sestil AD -1 tab every3-4 hours for 2-3day
2.dakson oz- 1/2 tab every 3-4 hours for 2-3day
Vomiting
Vomiting It is due to food poisoning or gastritis. Give sips of water. Treat the cause.
1.Gelusil or other antacids 1 tab every3-4 hours for 3-4 days
2.Domperidone(Domstal) 1 tab 3 times / day for 3-4 days prevents further vomiting.
3. IV saline (ringer lactate) 1-2 bottles to prevent Dehydration
 Constipation
ConstipationIt is due to faulty diet. Certain drugs can also cause it. The cause should be treated. Give lots of oral water, bananas, tomatoes and fruits. Green and leafy vegetables should be taken in sufficient quantity in the diet. The acute symptoms can be controlled with
1.isabgol,2-3 sppons mixed with warm water 2-times / day
2. dulcolax-2 tabs at bed time
3.liquid paraffin. 2-3 tablespoons swallowed every morning
4. if no relief go for soap water Enema


28, అక్టోబర్ 2013, సోమవారం

25, అక్టోబర్ 2013, శుక్రవారం

సిరివెన్నెల కలం నుండి జాలువారిన కవితా వనం

సిరివెన్నెల కలం నుండి జాలువారిన కవితా వనం


జరుగుతున్నది జగన్నటకం
జరుగుతున్నది జగన్నటకం
ఫురాతనపు పురాన వర్నన పైకి కనపడుతున్న కథనం
నిత్యజీవన సత్యమని భాగవత లీలల అంతరార్దం
జరుగుతున్నది జగన్నటకం జరుగుతున్నది జగన్నటకం
ఛెలియెలి కట్టలు తెంచుకొని విలయము విజ్రుంబించునని
థర్మ మూలమె మరిచిన జగతిని యుగాంతమెదురై ముంచునని
సత్యం వ్రతునకు సాక్షత్కరించి శ్రుష్టి రక్షనకు చెయుతనిచి
నావగ థ్రొవను చుపిన మథ్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం
...
ఛెయదలచిన మహత్కార్యము మొయజాలని భారమైతె
ఫొందగొరినదందలెని నిరాశలొ అనగారిపొతె
భుసలుకొట్టె అసహనపునిట్టుర్పు సెగలకు నీరసించక
ఓటమిని ఒడించగలిగిన ఒరిమె కుర్మమన్నది
క్షీరసాగరమదన మర్మం
ఊనికిని నిలిపె ఇలను కడలిలొ కల్పగ నురిగె ఉన్మాదంబును
ఖరాన్ల్ల దంస్టుల కుల్లగించి ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల
ధీరొద్దతిరన హుంకారం ఆది వరాహపు ఆకరం
ఏడి ఎక్కడరా
నీ హరి దాక్కున్నడెరా భయపడి
భయటకి రమ్మనరా ఎదుటపడి
నన్ను గెలవగలడా తలబది
నువు నిలిచిన ఈ నెలని అడుగు
ఈ నాడుల జీవ జల్లమ్ముని అడుగు
నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు
నీ ఊపిరిలొ గాలిని అడుగు
నీ అడుగుల ఆకాశనడుగు
నీలొ నరుని హరిని కలుపు
నీవె నరహరివని నువ్వు తెలుపు
ఊన్మత్త మతంగ భంగికథు కకవికథి
హంత్రు సంక్రథనీ క్రుదనీ వీదనీ జగథి
ఆహము రధమై ఎధిగె అవనికిధె అసలి నిహథి
ఆకతయుల నిహతి అనివర్యమవు నియథి
శిథ హస్థి హథ మస్థ కారినక సవకాసియొ
ఖ్రూరాసి క్రొసి హ్రుథదయ దంస్తుల దొసి మసి చెయ మహిథ యగ్నం
ఆమెయం అనొహ్యం అనంత విష్వం
ఆ బ్రహ్మండపు సూక్ష్మ స్వరూపం.. ఈ మానుష రూపం
ఖుబ్జాక్రుతిగ బుద్ధిని బ్రమింపజెసె అల్ప ప్రమానం
ఉజ్జగాలను మూడడుగులతొ కొలిచె థ్ర్య్ విక్రమ విస్థరనం
జరుగుతున్నది జగన్నటకం జగ జగ జగ జగ జగన్నటకం
జరుగుతున్నది జగన్నటకం జగ జగ జగ జగ జగమె నాటకం
ఫాపపు థరువై పుడమికి బరువై పెరిగిన ధర్మఙనిని పెరుగక
ఫరశు రాముడై.. భయధ భీముడై
ఫరశు రాముడై భయధ భీముడై
ధర్మగ్రహ విగ్రహుడై నిలచిన
శుద్రియ క్షత్రియ తత్వమె భార్గవుడు
ఎ మహిమలు లెక ఎ మాయలు లెక నమ్మసక్యము గాని ఎ మర్మము లెక
మనిషిగానె పుట్టి మనిషిగనె బ్రతికి
మహిత చరితగ మహిని మిగలగలిగెమనికి
సాధ్యమెనని పరంధముడె రాముదై ఇలలొన నిలచి
ఇన్ని రీతులుగ ఇన్నిన్ని పాత్రలుగ
నిన్ను నీకె నూత్న పరిచితునిగ దర్షింపజెయగల
ఙాన దర్పనము క్రిష్ణవతారమె స్రుష్ట్యవరన తరనము
ఆనిమగ మహిమగ గరిమగ లఖిమగ ప్రప్తిగా
ఫ్రగమ్యవర్తిగ ఈసత్వమ్ముగ వసిట్వమ్ముగ
నీలొని అష్టసిద్ధులు నీకు తణ్భట్టగా
శస్వరూపమె విస్వరూపమ్ముగ
నరుని లొపలి పరునిపై ద్రుష్టి పరుపగ
తలవంచి కైమొద్చి శిష్యుడవు నీవైతె
నీ ఆర్థి కడతెర్చు ఆచర్యుడవు నీవె
వందె క్రిష్ణం జగద్గురుం
వందె క్రిష్ణం జగద్గురుం
క్రిష్ణం వందె జగద్గురుం
క్రిష్ణం వందె జగద్గురుం
వందె క్రిష్ణం జగద్గురుం
వందె క్రిష్ణం జగద్గురుం
క్రిష్ణం వందె జగద్గురుం
క్రిష్ణం వందె జగద్గురుం
క్రిష్ణం వందె జగద్గురుం...

WhatsApp

24, అక్టోబర్ 2013, గురువారం

సిరివెన్నెల గాయ౦ మారేది ఎప్పటికో........?
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
...
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం
గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి మీ జ్ఞానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాటం
ఏ క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
క్రిష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం

23, సెప్టెంబర్ 2013, సోమవారం

శ్రీ రాముడు



రావణ లంక దొరికింది అనునది పుక్కిటి పురాణం కాదు ..నిజంగా జరిగినది అనే సాక్షాలు ఇవిగో .. ప్రతివొక్క హిందువుకు చేరేల షేర్ చెయ్యండి..!

సీతను దాచిపెట్టిన లంక దొరికింది. ఆంజనేయుడు సంజీవినీ పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుణ్ణి కాపాడిన లంక దొరికింది.. రామ రావణ యుద్ధం భీకరంగా జరిగిన లంక దొరికింది. ఇవి ఒట్టి మాటలు కావు.. పుక్కిటి పురాణం అంతకంటే కాదు.. లక్షల సంవత్సరాల నాటి యథార్థ గాథ.. ఒక మహా అసురుని ఉనికిని ఇవాళ్టికీ చాటి చెప్తున్న కథ.. ఇంతకాలం మిథ్యగా భావిస్తున్న చరిత్ర. రావణ రహస్య మిది..
ఇదేదో సోది రామాయణ కథ కాదు.. రావణ లంక.. ఇది ఒక నిజం.. నిప్పులాంటి నిజం… వైజ్ఞానికులకు కొత్త సవాలును విసురుతున్న నిజం.. భారత దేశ చరిత్రను గొప్ప మలుపును తిప్పనున్న నిజం… ఒక నాడు రావణుని రాజరికం అప్రతిహతంగా సాగిన రాజ్యం… సాక్ష్యాలతో సహా లభించింది. రామ రావణ యుద్ధంలో ఆనాడు రావణుడు చనిపోయి ఉండవచ్చు. కానీ, శ్రీలంకలో కనిపిస్తున్న సాక్ష్యాలలో రావణుడు ఇంకా జీవించే ఉన్నాడు.. ఇది నిప్పులాంటి నిజం.
లంక మిథ్య కాదు.. లంకేశ్వరుడు రాజ్యమేలిన లంక.. ప్రపంచాన్నంతా జయించి తెచ్చిన బంగారంతో నిర్మించిన మహానగరం లంక.. సముద్రం మధ్యలో అందమైన దీవిలో, అపురూపంగా రావణుడు నిర్మించుకున్న నగరం లంక ఇదే..మీరు రాముణ్ణి నమ్మకపోవచ్చు.. రాముడు ఉన్నాడా.. లేడా అని హేతువాదులతో వాదాలకూ దిగవచ్చు. కానీ, రావణుడి ఉనికిని మాత్రం ఇవాళ ఎవరూ కాదనలేరు.. రావణుడు ఉన్నాడన్నది వాస్తవం. సాక్షాత్తూ శ్రీలంక సర్కారే రావణుడి ఆనవాళ్లను అధికారికంగా గుర్తించింది. రాజముద్ర వేసింది.
రావణుడి ఆనవాళ్ళు శ్రీలంకలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. అశోకవనంతో ఈ గుర్తులు మొదలవుతాయి. అశోక వాటిక అని పిలిచే ఈ వనంలోనే సీతాదేవిని ఆనాడు రావణుడు బంధించి ఉంచాడు.. ఈ ప్రదేశంలో ఎవరు ప్రతిష్ఠించారో తెలియని వేల ఏళ్ల నాటి సీతారామచంద్రుల విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఈ ఆలయం పక్కనే సీతాజల పారుతుంది. సీతాదేవి కన్నీటితో ఏర్పడిన నీటి కుండమని ఇక్కడి ప్రజల విశ్వాసం..ఈ నీటి కుండాన్ని ఆనుకుని హనుమంతుని అడుగులూ మనకు కనిపిస్తాయి. అశోక వాటిక సమీపంలోమొక్కల్లో నల్లని మట్టి ఉంది.. ఇది మామూలు నల్లరేగడి మట్టో, లేక మరో రకమైన మట్టో కాదు.. బాగా కాలిపోయి ఉన్నట్లు కనిపించే మట్టి ఇది.. ఈ మట్టి ఇలా ఎందుకు ఉందో ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలకూ అంతుపట్టలేదు.. అశోక వాటిక చుట్టూ లెక్కలేనన్ని కోతులు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రదేశంలో ఇక్కడ మాత్రమే కోతులు కనిపిస్తాయి.
సీతా జలకు దగ్గరలోనే మరో చిన్న ఏరు పారుతుంటుంది.. అది నిత్యం రావణుడు స్నానం చేసే ఏరు.. ఇక్కడ స్నానం చేసి పరమేశ్వరుని అర్చించేవాడు రావణుడు.
ప్రతి చారిత్రక ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాలను చూపించి స్థల పురాణాలు చెప్పటం సహజమే.. లంకలో కనిపిస్తున్న ఆనవాళ్ళు కూడా ఇలాంటివే అనుకుంటే పొరపాటే.. ఇవాళ్టి శ్రీలంకలో ఆనాటి తేజోమయ రావణ లంక స్మృతులు చాలా చాలా ఉన్నాయి.. త్రేతాయుగాన్ని మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.
రావణ లంక సామాన్యమైంది కాదు.. రామాయణం ఉనికిని చాటిచెప్తున్న లంక.. రావణ స్నానం చేసే నది నుంచి దూరంగా చూస్తే ఓ పెద్ద పర్వతం కనిపిస్తుంది. ఆ పర్వతాన్ని జాగ్రత్తగా పరికిస్తే అతి పెద్ద హనుమాన్ ఆకృతి నిద్రిస్తున్నట్లుగా గోచరిస్తుంది.
ఈ పర్వతాన్ని రాము సోలా అని ఇక్కడి ప్రజలు పిలుస్తారు.. ఈ పర్వతం ఒక విచిత్రమైన పర్వతం.. రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు హనుమంతుడు హిమాలయాల నుంచి సంజీవని మొక్కను తీసుకువచ్చిన పర్వతం ముక్క ఇది.
ఇది సంజీవని తీసుకువచ్చిన పర్వతమేననటానికి రుజువేమిటి? ఏదో టూరిజం డెవలప్ చేసుకోవటానికి లంక సర్కారు ఏదో ఒక కొండను చూపించి ఇదే సంజీవని అంటే నమ్మేదెలా?
శ్రీలంక సర్కారు ఏమైనా చెప్పవచ్చు. కానీ, ఇది ఆంజనేయుడు సంజీవని తీసుకువచ్చిన సుమేరు పర్వతమనటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇలాంటి పర్వత భాగం శ్రీలంకలో మరెక్కడా కనిపించదు.. మనకు ఇది మామూలు కొండ.. కానీ, శ్రీలంక ప్రజలకు ఇది హాస్పిటల్… ఈ పర్వతంలో దొరికే మొక్కలన్నీ ఔషధ మొక్కలే కావటం ఇది సుమేరువే అనటానికి బలమైన సాక్ష్యం.
దీనికి దగ్గరలో ఉన్న ప్రజలు ఏ జబ్బు వచ్చినా డాక్టర్ల దగ్గరకు వెళ్లరు.. ఈ పర్వతం దగ్గరకు వచ్చి ఇక్కడి మొక్కలతోనే వైద్యం చేయించుకుంటారు..నికోల్ పారమల్ ఫార్మాస్యూటికల్స.. ఇతర దేశీయ, అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఈ ప్రాంతానికి వచ్చి ఔషధ మొక్కలను పరిశోధించాయి.
విచిత్రమేమంటే ఈ ఔషధ మొక్కలు పెరగాలంటే ప్రత్యేకమైన మట్టి కావలసి ఉంటుంది.. ఈ కొండపై మనకు కనిపించే మట్టి హిమాలయాల్లో మాత్రమే కామన్గా కనిపిస్తుంది…
రావణుడు దశకంఠుడు.. అంటే పది తలలు ఉన్నవాడు.. అంటే శారీరకంగా కాదు.. అతనిలో పది రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయని అర్థం. అతని మేధస్సు పది రకాలుగా, అనేక రంగాల్లో విస్తరించిందని అర్థం. ఇందుకు సాక్ష్యం మనకు లంకలో స్పష్టంగా కనిపిస్తుంది. అతను పండితుడో, సీతను అపహరించుకు వచ్చిన రాక్షసుడు మాత్రమే కాదు.. రావణుడు గొప్ప శాస్త్రవేత్త కూడా.
మీకు పుష్పక విమానం గుర్తుందా? అందులోనే సీతాదేవిని రావణుడు అపహరించుకు వెళ్లాడు… రావణ సంహారం తరువాత రాముడు అందులోనే అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆ కాలంలో విమానాలు ఉన్నాయా? అంటే ఉన్నాయని లంక చెప్తోంది.. చూపిస్తోంది.. రావణుడు తన లంకాపట్టణంలో నిర్మించిన అయిదు విమానాశ్రయాలను శ్రీలంక సర్కారు గుర్తించింది.. అంతే కాదు.. ఒక విమానాల మరమ్మతు కేంద్రాన్ని కూడా గుర్తించింది.. వీటన్నింటినీ హనుమంతుడు లంకాదహన సమయంలో కాల్చివేశాడు..
శ్రీలంక పరిశోధనల్లో గరుడ పక్షి ఆకారంలోని ఓ బొమ్మ దొరకింది. ఈ ఆకారాన్ని జాగ్రత్తగా పరిశోధించారు… గరుడపక్షి ఆకృతిలో ఉన్న ఈ బొమ్మ మామూలు విగ్రహం కాదు.. దీనికి ఉన్న రెక్కలు సాధారణ గరుడ పక్షికి ఉండే స్థాయి కంటే కొద్దిగా ఎత్తులో ఉన్నాయి. దీనిపై ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.. వాస్తవానికి ఇది ఓ లోహ యంత్రం. వేల ఏళ్ల నాటిది.. ఆనాడు ఇది ఎలా ఎగిరిందీ అన్నదానిపై లంక ప్రభుత్వం ఇంకా పరిశోధిస్తూనే ఉంది.
ఇక విమానాశ్రయం దగ్గరకు వస్తే.. శ్రీలంక రాజధాని కొలంబో నుంచి దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రయాణం చేస్తే ఓ పెద్ద పర్వత ప్రాంతం వస్తుంది. ఇక్కడ దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తున సుమారు ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో మైదాన ప్రాంతం ఉంది.. అంత ఎత్తున ఇంత విస్తీర్ణంలో మైదానం ఉండటం, ఈ మైదానానికి నాలుగు వైపులా కొండలు ఉండటం విశేషం. ఈ మైదానం మానవ నిర్మితమైనదేనని స్పష్టంగా కనిపిస్తోంది. దీన్నే రావణుడు తన విమానాశ్రయంగా వినియోగించాడని శ్రీలంక పరిశోధన బృందం నిర్ధారించింది.
మరో విశేషమేమంటే ఈ మైదానం అంతటా కాలిపోయిన గుర్తులు ఉన్నాయి. ఇక్కడి మట్టి కాలి నల్లగా మాడిపోయింది.. ఇక్కడి రాళు్ల కాలి కనిపిస్తున్నాయి. ఎనిమిది వేల అడుగుల ఎత్తులో తక్కువ వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో ఇంకా వేడి వాతావరణం ఉండటం విశేషం.. లంకాదహనం చేసినప్పుడు హనుమంతుడు ముందుగా రావణుడి రవాణా వ్యవస్థను, సాంకేతిక వ్యవస్థలనే దహనం చేశాడు.. అందుకు సాక్ష్యం ఈ విమానాశ్రయం.
రావణుడికి సంబంధించిన వివరాలు ముఖ్యంగా వాల్మీకి రామాయణంలో, ఆ తరువాత తులసీదాస్ రామచరిత మానస్లో మనకు ముఖ్యంగా కనిపిస్తాయి.. లంకలో అడుగడుగునా రామాయణ కాలం నాటి గుర్తులు లభిస్తున్నాయి..
తులసీదాస్ రాసిన రామచరితమానస్ ఒరిజినల్ ప్రతి ఒకటి చిత్రకూటంలో భద్రంగా ఉంది. అయితే ఆయన స్వయంగా రాసిన వాటిలో ఒకే ఒక అధ్యాయం ప్రపంచానికి మిగిలి ఉంది. చేత్తో తయారు చేసిన కాగితంపై రాసిన ఈ రామాయణంలో మిగిలి ఉన్న అధ్యాయం 117 పేజీల్లో ఉంది. ఒక్కో పేజీకి 7లైన్లు రాసి ఉంది.
కెలీనియా.. రావణుడి తమ్ముడు విభీషణుడి రాజభవనం ఉన్న ప్రాంతం.. ప్రస్తుతం బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్న శ్రీలంకలో కెలీనియా చాలా ముఖ్యమైన ప్రదేశం. బుద్ధ భగవానుడు ఈ ప్రాంతానికి వచ్చినట్లు చరిత్ర చెప్తోంది. ప్రపంచంలోని బౌద్ధులు శ్రీలంకకు వస్తే కెలీనియా చూడకుండా వెళ్లరు.. ఆ పక్కనే విభీషణుడి భవనాన్నీ సందర్శిస్తారు.. ఇంతెందుకు లంక సార్లమెంటులో విభీషణుడి ఫోటో కనిపిస్తుంది…
ఆ తరువాత నరోలియా.. ఇక్కడే అశోక్ వాటిక ఉంది. దీనికి సమీపంలోనే సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది. అయితే ఇక్కడ విచిత్రం ఉంది. ఇక్కడ అటవీ ప్రాంతంలో కొన్ని చిత్రమైన గోళీలు దొరుకుతాయి. ఈ గోళీలను సీతా గోళీలంటారు.. ఇవి అలోపతి మాత్రల్లాంటివి.. ఈ గోళీలను దొరకడమే భాగ్యంగా ప్రజలు భావిస్తారు. వీటిని తలకు రాసుకోవటం, కడుపుకు రాసుకోవటం, వాటిని పొడిని చేసి కొద్దిగా తీసుకోవటం వంటివి చేస్తారు.. ఈ గోళీలను శ్రీలంక ప్రభుత్వం జపాన్కు పంపించి పరీక్ష చేయించింది. ఇందులో వైద్య లక్షణాలు ఉన్నట్లు దాదాపు పదివేల సంవత్సరాలకు పూర్వ కాలం నాటివేనని నిర్ధారణ అయింది. రావణుడికి సంబంధించి ఇప్పటి వరకు లభించిన ఆధారాలన్నీ ఒక ఎత్తైతే , అసుర రాజు అస్తిత్వానికి సంబంధించిన అత్యంత కీలక సాక్ష్యం మరొకటి ఉంది. అది రావణ గుహ. లంకలో రామరావణ యుద్ధం భీకరంగా జరిగింది. రామబాణంతో రావణుడిని శ్రీరామ చంద్రుడు హతమార్చాడు.. రావణుడు మరణించిన తరువాత ఏం జరిగింది? వాల్మీకి రామాయణంలో కానీ, రామ చరితమానస్లో కానీ, రావణుడు చనిపోయిన తరువాత ఏం జరిగిందో ప్రస్తావన లేదు.. రావణుడి అంత్యక్రియలు జరిగాయో లేదో తెలియదు.. కానీ, ఇప్పుడు రావణుడికి సంబంధించిన అత్యంత గొప్ప రహస్యం వెలుగులోకి వచ్చింది. అదే రావణ గుహ.
శ్రీలంకలోని కెలీనియాకు కొద్ది దూరంలోఎత్తైన ప్రదేశంలో ఒక పెద్ద గుహ ఉంది.. ఈ గుహలోకి ప్రవేశించటం చాలా కష్టమైన పని.. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పశువులు కాసుకునే ఒక కాపరి ఈ గుహలోకి అనుకోకుండా వెళ్లాడు.. ఈ గుహలో ఒక పెద్ద శవపేటిక ఉంది.. ఈ పేటికలో ఒక శవం ఉందని, దాన్ని చూడగానే భయంతో వెనక్కి వచ్చేసినట్లు అతను చెప్పాడు.. అది రావణుడి భౌతిక శరీరమని చెప్తున్నారు.. ఈ శవపేటిక దాదాపు పదిహేడు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉంది. ఈ శవపేటిక చుట్టూ రకరకాల రసాయన లేపనాలు రాసి ఉన్నాయి.
రావణుడు చనిపోయిన తరువాత ఆయన భౌతిక దేహాన్ని నాగజాతి ప్రజలు తీసుకెళ్లి ఈ శవపేటికలో భద్రపరిచారట. శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి ఈ శవపేటికను తెరిచేందుకు పలుమార్లు ప్రయత్నించింది. ప్రయత్నించిన ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఒకసారి చిరుతపులులు, మరోసారి పెద్ద పాములు అడ్డం వచ్చాయి. హెలికాప్టర్లో వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు సరిగ్గా గుహ దగ్గరకు వచ్చేసరికి వాతావరణం హఠాత్తుగా మారిపోయి తప్పనిసరిగా వెనక్కి మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గుహలో అతని అనుచరులు కాపలా ఉన్నారని, లక్ష్మణుడి మాదిరిగా సంజీవని తో తమ రాజు పునర్జీవుతుడవుతాడని నమ్ముతున్నారు .. రావణుడి ఉనికికి సంబంధించిన చాలా ముఖ్యమైన సాక్ష్యం ఇది. ఈ పేటిక రహస్యాన్ని ఛేదించగలిగితే చరిత్రలో అనేక కొత్త కోణాలు వెలికి వస్తాయి. చూద్దాం ఏం జరుగుతుందో. కాలమే సమాధానం.
రావణుడు.. రామాయణం… భారతీయ సంస్కృతి, నాగరికతలతో గాఢంగా పెనవేసుకుని పోయిన అంశాలు.. శ్రీలంకలో రావణుడి ఆనవాళ్లు అనేకం మనకు కనిపిస్తాయి. అడుగడుగునా కనిపించే అక్కడి నిర్మాణాలు, కట్టడాల శిథిలాల్లో ఏడువేల సంవత్సరాల క్రితమే అత్యంత వైభవంగా భారత ఉపఖండంలో విలసిల్లిన నాగరికత స్పష్టంగా కనిపిస్తుంది.. అంతే కాదు.. రామాయణం గురించి మనకు అందుబాటుకు ఇంతకాలం రాని అనేక అంశాలు మనకు లంకలో కొత్తగా కనిపిస్తాయి.లంకలో రావణ రహస్యం గురించి మరి కొన్ని అంశాలను మనం తెలుసుకుందాం.
మనలో ప్రత్యేకించి ఈ తరంలో వాల్మీకి స్వయంగా రాసిన అసలైన రామాయణాన్ని చదివిన వాళ్లు వేళ్లపైన లెక్కించదగిన వాళ్లే ఉంటారు.. ఈ తరానికి తెలిసిందల్లా, ఎక్కువగా సినిమాల్లో చూసిన రామాయణ కథే…ఈ దేశంలో ఎన్ని రామాయణాలు వెలుగులోకి వచ్చాయో చెప్పలేం.. వాల్మీకి రాసింది ఒక రామాయణం.. వేర్వేరు భాషల్లో వేర్వేరు సమయాల్లో వచ్చిన రామాయణాల్లో కొత్త కొత్త ఉపకథలు పుట్టుకొచ్చాయి.. ఇప్పుడు లంకలో మనకు చూపిస్తున్న ఆనవాళ్లలో మరో సరికొత్త రామాయణం ఆవిష్కారం అవుతోంది.
రావణుడు సీతాదేవిని పంచవటి నుంచి అపహరించుకుని వెళ్లి ఎక్కడ దాచాడు? అని అడిగితే టక్కున వచ్చే జవాబు అశోక వనం.. కానీ లంక అదే శ్రీలంకలో సీన్ వేరేలా ఉంది.. సీతాదేవిని పరిస్థితులను బట్టి, ముందు జాగ్రత్త చర్యగా వేర్వేరు ప్రదేశాలకు రావణుడు తరలించాడట..పంచవటిలో, పర్ణశాలలో ఉన్న సీతాదేవిని తన పుష్పకంలో లంకకు తీసుకువచ్చిన రావణుడు వెరగన్ తోటలోని తన ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాడు.. పక్కనే ఉన్న తన భార్య మండోదరి దేవి భవనానికి సీతమ్మను తీసుకువెళ్లాడు.
లంకాపురంలో అతిగొప్ప ప్యాలెస్ మండోదరికి ఉండేదిట..చుట్టూ జలపాతాలు.. పూల తోటలు. అక్కడ సీత ఉన్నది కొన్ని రోజులే. ఆ తరువాత అశోకవాటికకు తరలించాడు.. మండోదరి భవనానికి చాలా దూరంలో అశోక వాటిక ఉంది. అక్కడికి విమానంలోనే సీతను రావణుడు తీసుకువెళ్లాడు.. ఆకాశమార్గంలో లంకానగర సౌందర్యాన్ని అద్భుతంగా ఏరియల్ వ్యూ ద్వారా సీతాదేవికి వర్ణిస్తూ చూపించాడట రావణుడు.
అశోక వాటికకు సమీపంలోనే సీతా పకన్ అనే చిన్న ప్రాంతం ఉంది.. చుట్టూ కమ్ముకుని ఉన్న దట్టమైన అడవి.. నిటారుగా నిలుచుని వున్న వృక్షాల మధ్య ౨౦౦ గజాల మేరకు ఉన్న చిన్న స్థలం.. అంత అడవిలో ఇక్కడ చిన్న మొక్క కూడా మొలవదు.. గతంలో ఇక్కడ నీళ్లు ఉండేవట.. సీతాదేవి లంకనుంచి అయోధ్యకు వెళ్లిన తరువాత ఇది పూర్తిగా డ్రె అయిపోయింది.. అప్పటి నుంచి ఇలాగే ఉంది.
ఇస్త్రిపుర . అంటే ఏరియా ఆఫ్ వుమెన్ అని అర్థం. హనుమంతుడు లంకకు వచ్చి చేయాల్సిన బీభత్సం అంతా చేసేశాక, ముందు జాగ్రత్త చర్యగా రావణుడు సీతాదేవిని అశోకవాటిక నుంచి ఇస్త్రిపురకు తరలించాడట. ఇక్కడి నుంచి కూడా రావణ గోడా అనే ప్రాంతానికి సీతను షిప్ట్ చేసినట్లు చెప్తారు.. అది ఇస్త్రిపురకు మరోవైపున ఉంది…
ఈ ప్రాంతాన్ని దిశృంపోలా అంటారు ఇప్పుడు ఇక్కడ బుద్ధుడి ఆలయం ఉంది.. దీంతో పాటే అతి ముఖ్యమైన ప్రాంతం ఇది.. రావణ సంహారం తరువాత సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశం ఇదే… ఇక్కడ బౌద్ధ మతాచార్యులు ఓ స్తూపాన్ని కూడా నిర్మించారు..
లంకలో సీతాదేవికి సంబంధించిన చాలా ఆనవాళ్లను మనం చూడవచ్చు. అదే సమయంలో రామాయణంలో రావణుడి సంబంధించినంత వరకు మిగతా కేరెక్టర్లు కొన్ని ఉన్నాయి..వాళ్లకు సంబంధించిన స్మృతులు కూడా ఇప్పటికీ మనకు లంకలో కనిపిస్తాయి…
లంకలోని కెలీనియాలో రావణ సోదరుడు విభీషణుడికి పట్టాభిషేకం జరిగినట్లు గతంలోనే చెప్పుకున్నాం…ఇక్కడ విభీషణుడికి ఓ ఆలయం కూడా ఉంది.. లంక పార్లమెంటులో కూడా విభీషణుడి చిత్రపటం మనకు కనిపిస్తుంది..అంతే తప్ప అంత గొప్ప నాగరికతను ప్రపంచానికి అందించిన రావణుడికి మాత్రం ఎక్కడా ఆలయం లేదు..
రావణుడి కొడుకు ఇంద్రజిత్.. ఇతను కూడా శివుడికి మహా భక్తుడు.. ఈతడు శివుని పూజించిన ఆలయం, అందులో శివలింగం ఇవాళ్టికీ పూజలందుకుంటున్నాయి.
రావణుడి తల్లి కేకసి.. ఈమె భవనం సముద్రానికి సమీపంలో ఉండేది.. ఆమె నిత్యం ఉదయం ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి దానికి పూజ చేసి వచ్చేది.. శ్రీలంకలోని తిరుక్కోవిల్లో ఆమె తల్లి భవంతి ఉండేది.. ఇప్పుడా ప్రాంతంలో దేవాలయం ఉంది..ఇక్కడో విచిత్రం ఉంది.. తన తల్లి మరణించిన తరువాత ఆమె అంత్యక్రియలు జరిపిన తరువాత స్నానాదులకు మంచినీరు కరవైందట.. అప్పుడు రావణుడు తన త్రిశూలంతో ఏడుసార్లు నేలను గట్టిగా కొట్టాడట.. దీంతో ఏడు ప్రాంతాలలోని నీటిధార ఉబికి వచ్చింది. సముద్రానికి దగ్గరలో మంచినీటి బావులు ఇవి. ఈ ఏడింటిలో నీటి ఉష్ణోగ్రతలు ఏడు రకాలుగా ఉండటం ఇక్కడి విచిత్రం.
తోటపాలకొండలో రావణుడి అతి పెద్ద గోశాల ఉంది.. లంకారాజ్యానికంతటికీ అదే ఏకైక డైరీఫారమ్.. శ్రీలంకలోనే కలుతర అన్న ప్రాంతంలో రావణుడికి మరో కోట ఉండేది.. ఈ కోట ఇప్పుడు సముద్ర గర్భంలో కలిసిపోయిందని చెప్తారు.. దీనికోసం లంక సర్కారు పరిశోధిస్తోంది.. ఇప్పుడు ఈ ప్రాంతంలో లైట్ హౌస్ కనిపిస్తుంది.
ఇక్కడ హనుమంతుడి గురించి కొంత చెప్పుకోవాలి.. లంకాదహనం చేశాక ఓ ప్రాంతంలో కాసేపు రెస్ట్ తీసుకున్నాడు.. దాన్ని ఇప్పుడు రామ్ బోడా అంటారు.. అక్కడ చిన్మయ మిషన్ వాళ్లు అతి పెద్ద ఆలయ నిర్మాణం చేశారు..
రామాయణంలో మనకు తెలిసిన రావణుడు వేరు..లంకలో కనిపిస్తున్న రావణుడు వేరు.. ఆయన సీతను ఎత్తుకుపోయిన సంగతే చాలామందికి తెలుసు. ఆయన పండితుడన్న సంగతి కొందరికి తెలుసు.. కానీ, రావణుడిలో మనకు అంతు చిక్కని అనేక కోణాలు ఉన్నాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే రావణుడిలో అనేక కోణాలు బయటపడతాయి. తన భార్య మండోదరితో సరదాగా ఆడుకోవటానికి చెస్ను కనుక్కొన్నాడట. ఆమెతో కలిసి వీణ అద్భుతంగా వాయించేవాడట రావణబ్రహ్మ.
రావణుడికి సంబంధించి అయిదు విమానాశ్రయాలను లంక సర్కారు కనుక్కొందని చెప్పుకున్నాం.. గుర్లపోతలో విమాన మరమ్మతు కర్మాగారం ఉంది.. వాల్మీకి రామాయణంలోనూ ఈ గుర్లపోత ప్రస్తావన ఉంది. రావణుడి విమానం పెద్ద నెమలి ఆకారంలో ఉండేదిట.. దీనికి సింహళభాషలో గుర్లపోత అంటారు..అంటే పక్షి వాహనం అని అర్థం. విమానాన్ని సింహళ భాషలో దండు మోనరా అంటారు.. అంటే ఎగిరే నెమలి అని అర్థం.
రావణ లంకానగరం అపూర్వమైంది.. అపూర్వ నిర్మాణాన్ని కలిగి ఉన్నది.. లంకానగరం శత యోజన విస్తీర్ణంలో నిర్మించారని రామాయణం చెప్తోంది.. ఏడు ప్రాకారాలు, ఎనిమిది ద్వారాలు.. మూడు కందకాలతో అత్యంత సురక్షితంగా లంకా నగరాన్ని నిర్మించాడట రావణుడు.. ఆనాటి లంకలో నాలుగు లక్షల వీధులు ఉండేవిట.
లంకలో చాలా ప్రాంతాల్లో అనేక గుహలు, సొరంగాలు కనిపిస్తాయి. ఇవన్నీ రావణ కాలం నాటివే. రావణుడి ఆర్కిటెక్చరల్ ప్రతిభకు ఇవి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ సొరంగాలు లంకలోని అన్ని పట్టణాలకు ఒకదానితో మరొకటి లింక్ కలిపే నెట్వర్క్ వ్యవస్థను కలిగి ఉన్నాయి.
ఈ సొరంగాలు తొందరగా ఒకచోటి నుంచి మరోచోటికి తరలివెళ్లేందుకు సరైన రవాణా వ్యవస్థను కలిగి ఉన్నాయి.
ఈ సొరంగాలు సహజంగా ఏర్పడినవి కావు.. ప్రతి సొరంగం మానవ నిర్మితమేనని స్పష్టంగా తెలుస్తుంది.. రావణ గుహకే దాదాపు ఏడు వందల దాకా కిటికీలు ఉన్నాయి,
ఎంత గొప్ప నగర నిర్మాణం.. ఎంత సాంకేతిక పరిజ్ఞానం.. ఎంత గొప్ప నాగరికత.. భారత దక్షిణా పథాన కనీవినీ ఎరుగని సాంస్కృతిక వైభవం విలసిల్లిన లంకానగరం ఎంత దారుణంగా ధ్వంసమైంది? తన ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా చేసిన సార్వభౌముడు ఎలా పతనమయ్యాడు..
పధ్నాలుగేళ్ల వనవాసానికి అయోధ్య నుంచి బయలు దేరిన రామచంద్రుడు చిత్రకూటం మీదుగా పంచవటికి వెళ్లాడు.. అప్పటికి దండకారణ్యం దాకా రావణుడి ఆధిపత్యం కొనసాగినట్లు తెలుస్తుంది.. దండకారణ్యంలో రావణుడి గవర్నర్ ఖరుడు పరిపాలన సాగించాడు.. రాముడు ఖరదూషణులను ఇక్కడే చంపాడు..
పంచవటి నుంచి కిష్కింధకు వెళ్లిన రాముడు అక్కడ వానర సైన్యాన్ని కలుసుకున్నాడు.. ఆ సైన్యం తోనే శ్రీలంకకు చేరుకున్నాడు.. భారతీయ నిర్మాణ రంగంలోనే అపురూపమైన సేతువును రాముడు రామేశ్వరం మీదుగా లంకలోని తలైమన్నార్ దాకా నిర్మించాడు. నీటిపై తేలే రాళ్లతో వానర సైన్యంలోని నీలుడి పర్యవేక్షణలో ఈ సేతు నిర్మాణం సాగింది.. ఇదేం విచిత్రం కాదు.. నీటిపై తేలే ఇటుకలను ఇప్పుడు వరంగల్లోని రామప్ప దేవాలయ గోపురంలోనూ మనం చూడవచ్చు.. లైట్వెయిట్ స్టోన్స్, నీరు, ఇసుక.. పునాదులపై నిర్మాణాలు భారతీయులకే సాధ్యమైన విద్యలు.. రామ సేతువు ఇవాళ్టికీ సుమారు ౩౦ కిలోమీటర్ల మేర మనకు కనిపిస్తుంది.
శ్రీలంక సరిహద్దులకు చేరుకున్నాక రాముడు తన సైన్యంతో నీలవరై పుత్తుర్ దగ్గర మొదట ఆగాడట.. అక్కడ రాముడు తన సైన్యం కోసం సృష్టించిన నీటి జల ఇప్పటికీ కనిపిస్తుంది..
నీలవరై పుత్తుర్ దగ్గర నుంచి లగ్గల అన్న ప్రాంతానికి రాముడి సైన్యం తరలింది.. లగ్గల అంటే టార్గెట్ రాక్ అని అర్థం.. ఈ పర్వత పై భాగం నుంచి రావణ సైన్యం రాముడి గురించిన సమాచారాన్ని అందించింది.. ఈ ప్రాంతం భౌగోళికంగా ఉత్తర లంకలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి ఈశాన్య భాగంలో తిరుకోణేశ్వరం ఉంది.. అటు వాయవ్య దిశలో తలైమన్నార్ ఉంటుంది.. రామసేతువు లంకకు కలిపింది ఇక్కడే.. ఈ తిరుకోణేశ్వరంలోనే రావణుడు తపస్సు అదేనండీ ఇవాళ మనం అనే మెడిటేషన్ చేసేవాడు..
ఈ యుద్ధ భూమిలోనే భీకరంగా రామరావణుల పోరాటం జరిగింది. రామబాణానికి దశకంఠుడు నేలకొరిగాడు.. రాక్షస సంహారం జరిగింది. సుందరలంక స్మశానంగా మారిపోయింది.. రాముడు వనవాసానికి వెళ్లేనాటికా ఆయన వయసు ౨౫ సంవత్సరాలు.. రావణున్ని హతమార్చేప్పటికి రాముడు ౩౯ ఏళ్ల వాడు.
రావణ సంహారంతో రామాయణం ముగియలేదు.. యుద్ధం తరువాత రాముడు సీతాలక్ష్మణ సమేతంగా బయలు దేరినప్పుడూ లంకలోని కొన్ని ప్రాంతాలలో ఆగాడు.. సేద తీరాడు.. పరమేశ్వరుని కొలిచాడు.
రావణ వధ తరువాత సీతారామలక్ష్మణులు పుష్పకంలో అయోధ్యకు బయలు దేరుతూ వందారుమూలై అన్న ప్రాంతంలో కాసేపు ఆగారు.
వందారుమూలైలో ఉన్నప్పుడు రాముడికి అనుమానం కలిగింది.. రావణుడు బ్రాహ్మణుడు.. అతణ్ణి చంపినందుకు తనకు బ్రహ్మహత్యాదోషం చుట్టుకుంటుంది కదా అన్న సందేహంతో దీనికి పరిష్కారం చెప్పమంటూ పరమేశ్వరుని కోరాడు.. అప్పుడు శివుడు నాలుగు ప్రాంతాలలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించమని రాముడికి సూచించాడట.. దీంతో రాముడు లంకలో మానావారి అన్న ప్రాంతంలో తొలి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు.. దీన్ని రామలింగ శివుడని కొలుస్తారు.. ఆ తరువాత తిరుకోణేశ్వరంలో, అక్కడి నుంచి తిరుకేదారేశ్వరంలో మరో రెండు శివలింగాలను ప్రతిష్ఠించాడు… చివరగా భారత భూభాగంలో ఇప్పుడున్న రామేశ్వరంలో మరో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు..
పుష్పకంపై తిరిగి వెళ్తూ, రాముడు రామసేతువును పాక్షికంగా ధ్వంసం చేసి వెళ్లాడని కూడా కథనం చెప్తారు.. మొత్తం మీద రావణ లంక భారతీయ నాగరికతలోని అనేక కొత్త కోణాలను వెలికి తీస్తున్నది..
రామాయణం- ప్రాచీన ప్రదేశాలు – ఆధునిక నామధేయాలు
:::::::::::::::::::::::::::::::::::::

  1. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం – గంగోత్రి, ఉత్తరాఖండ్
  2. కపిల మహర్షి ఆశ్రమం, (శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం. గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) – గంగాసాగర్, వెస్ట్ బెంగాల్
  3. కాంభోజ రాజ్యం – ఇరాన్ (శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).
  4. రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా
  5. పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చోటు – గోకర్ణ, కర్ణాటక
  6. సీతాదేవి భూమిలో లభించిన చోటు – సీతామర్హి, బీహార్
  7. మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) – జనక్ పూర్, నేపాల్.
  8. కోసలదేశం – రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం.
  9. దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం – ఫైజాబాద్, ఉత్తర్ ప్రదేశ్.
  10. సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) – ఘాఘర నది.
  11. అయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం, బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం, సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) – అయోధ్య, ఉత్తర్ ప్రదేశ్.
  12. తాటక వధ జరిగిన ప్రదేశం – బక్సర్, బీహార్
  13. అహల్య శాపవిమోచన స్థలం – అహిరౌలి, బీహార్
  14. కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) – సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్
  15. గుహుడు సీతారామ లక్ష్మణులను కలిసిన చోటు – శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర
  16. దండకారణ్యం – చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లలోని కొన్ని ప్రాంతాలు.
  17. చిత్రకూటం (సీతారామ లక్ష్మణులు వనవాసం చేసిన చోటు) – సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.
  18. పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) – నాసిక్, మహరాష్ట్ర.
  19. కబంధాశ్రమం – కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.
  20. శబరి ఆశ్రమం – సర్బన్, బెల్గావి, కర్ణాటక.
  21. హనుమంతుడు రామ లక్ష్మణులను మొదటిసారిగా కలసిన ప్రదేశం – హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.
  22. ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర, కర్ణాటక.
  23. విభీషణుడు రాముణ్ణి శరణు కోరిన స్థలం – ధనుష్కోటి, తమిళనాడు.
  24. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం, తమిళనాడు
  25. రత్నద్వీపం / సింహళం / లంక – శ్రీలంక.
  26. అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) – కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక.
  27. శ్రీరాముడు రావణుని వధించిన చోటు – దునువిల్ల, శ్రీలంక.
  28. సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం – దివిరుంపోల, శ్రీలంక.
  29. వాల్మీకి ఆశ్రమం/ కుశ లవుల జన్మ స్థలం / సీతాదేవి భూదేవిలో ఐక్యమైన స్థలం – ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.
  30. కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) – కుశార్, పాకిస్తాన్.
  31. లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) – లాహోర్, పాకిస్తాన్
  32. తక్షశిల (శ్రీరాముని తమ్ముడు భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) – తక్షశిల, పాకిస్తాన్
  33. పుష్కలావతి/ పురుష పురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) – పెషావర్, పాకిస్తాన్.