| సిరివెన్నెల గాయ౦ మారేది ఎప్పటికో........? |
| నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని |
| అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని |
| ... |
| మారదు లోకం మారదు కాలం |
| దేవుడు దిగి రానీ ఎవ్వరు ఏమైపోనీ |
| మారదు లోకం మారదు కాలం |
| గాలివాటు గమనానికి కాలిబాట దేనికి |
| గొర్రెదాటు మందకి మీ జ్ఞానబోధ దేనికి |
| ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాటం |
| ఏ క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం |
| రామబాణమార్పిందా రావణ కాష్టం |
| క్రిష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం |
| నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని |
| అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని |
| మారదు లోకం మారదు కాలం |
| పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా |
| అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా |
| వేట అదే వేటు అదే నాటి కథే అంతా |
| నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా |
| బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా |
| శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ |
| నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని |
| అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని |
| మారదు లోకం మారదు కాలం |
| దేవుడు దిగి రానీ ఎవ్వరు ఏమైపోనీ |
| మారదు లోకం మారదు కాలం |
నాకు తోచిన, నాకు నచ్చిన సేకరణ మరియు స్వంత మాటలు, నచ్చితే చూడండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.
24, అక్టోబర్ 2013, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి